హైదరాబాద్‌లో కొత్తగా 17 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు

Updated : 19 Apr 2020 20:25 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అధికంగా ఉన్న హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇవాళ మరో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు బల్దియా ఓ ప్రకటనలో పేర్కొంది. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. వారికి ప్రైమరీ కాంటాక్టులో ఉన్నవారికి కూడా టెస్టులు చేశామని అధికారులు పేర్కొన్నారు. వారందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు