టిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం

కరోనా ఉద్ధృతితో హైదరాబాద్‌ మహానగరంలో పరిస్థితులు సీరియస్‌గా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో

Published : 25 Apr 2020 10:28 IST

హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతితో హైదరాబాద్‌ మహానగరంలో పరిస్థితులు సీరియస్‌గా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో పరిస్థితులను సమీక్షించేందుకుగాను దిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ బృందం శనివారం ఉదయం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను సందర్శించింది. కొవిడ్‌ రోగులకోసం కల్పించిన సదుపాయాలను పరిశీలించింది. క్షేత్రస్థాయిలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించిన అనంతరం సీఎంతోపాటు మంత్రులు, అధికారులతో చర్చించి రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర బృందం అంచనావేయనుంది. కొవిడ్‌ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 1500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు