జులై వరకు సరిపడా నిల్వలున్నాయి

లాక్‌డౌన్‌లోనూ అత్యవసర సేవల కింద దేశవ్యాప్తంగా మెడికల్‌ దుకాణాలు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మందుల లభ్యతపై ఆందోళనతో కొందరు పెద్ద మొత్తంలో కొనిపెట్టుకుంటున్నారు! దీనిపై స్పష్టత ఇస్తూ....

Published : 03 May 2020 19:12 IST

మందుల లభ్యతపై ఏఐసీడీఏ

థానే: లాక్‌డౌన్‌లోనూ అత్యవసర సేవల కింద దేశవ్యాప్తంగా మెడికల్‌ దుకాణాలు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే. మందుల లభ్యతపై ఆందోళనతో కొందరు పెద్ద మొత్తంలో కొనిపెట్టుకుంటున్నారు! దీనిపై స్పష్టత ఇస్తూ.. దేశంలో సరిపడా ఔషధాల నిల్వలు ఉన్నాయని ఆల్‌ ఇండియా కెమిస్ట్స్‌, డ్రగ్గిస్ట్స్‌ అసోసియేషన్‌(ఏఐసీడీఏ) అధ్యక్షుడు జగన్నాథ్‌ షిండే వెల్లడించారు. ఆందోళన చెంది పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 8.50 లక్షల మెడికల్‌ దుకాణాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు జులై వరకు సరిపోతాయని వివరించారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు ఫార్మా సంస్థల నుంచి కొత్త ఉత్పత్తులు వస్తున్నట్లు తెలిపారు. కేవలం వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగా విక్రయాలు కొనసాగించాని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు