భైంసాలో 24 గంటల కర్ఫ్యూ

నిర్మల్‌ జిల్లా భైంసాలో నిన్న అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇక్కడ 24 గంటల కర్ఫ్యూను పోలీసులు...

Updated : 11 May 2020 10:04 IST

భైంసా పట్టణం:  నిర్మల్‌ జిల్లా భైంసాలో నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక శివాజీ నగర్‌లో సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. అనంతరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒక కారు, ఆటో అద్దాలను ధ్వంసం చేసి.. ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. సమాచారమందుకున్న భైంసా పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘర్షణ కారణంగా నేడు పట్టణంలో 24 గంటల కర్ఫ్యూ విధించారు. డీఎస్పీ నర్సింగరావు నేతృత్వంలో సీఐలు వేణుగోపాల్‌రావు, ప్రవీణ్‌కుమార్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, కరీంనగర్‌ డీఐజీ ప్రమోద్‌కుమార్‌ భైంసాకు చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని