
నడిరోడ్డుపైనే మహిళ ప్రసవం
మల్లాపూర్: 108 అంబులెన్స్ ఆలస్యంగా రావడంతో ఓ మహిళ నడిరోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చింది. మల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఫిర్జాదీబేగం సోమవారం రాత్రి 8.40 గంటలకు పురిటినొప్పులతో బాధపడుతుండగా 108కు సమాచారం అందించారు. ఘట్‌కేసర్ నుంచి వస్తున్నామంటూ చెప్పడంతో గంటకు పైగా వేచి చూశారు. నొప్పులు తీవ్రం కావడంతో ఆమె నడిరోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన 15నిమిషాలకు ‘108’ రావడంతో తల్లీ బిడ్డను కోఠి ఆసుపత్రికి తరలించారు.
108లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం
మెహిదీపట్నం: రాజేంద్రనగర్‌కి చెందిన సమీనా బేగం(30)కు సోమవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. భర్త అప్పటికే కూరగాయలు అమ్మేందుకు వెళ్లడంతో.. ఇంట్లో పెద్దలెవరూ లేరు. ఆమెకు రక్త స్రావం ఎక్కువ కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. మెహిదీపట్నం 108 ఈఎంటీ రబ్బానీ.. అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా సమీనా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను కార్వాన్‌లోని పన్నీపురా ఆస్పత్రికి తరలించారు.