మాస్క్‌ల ఎగుమతిపై ఆంక్షలు సడలింపు

విదేశాలకు మాస్క్‌లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాటన్‌, పట్టు, ఉన్ని సహా నాన్‌ మెడికల్‌, నాన్‌ సర్జికల్‌ మాస్క్‌లపై ఆంక్షలను ఎత్తేసింది. అయితే ఎన్‌-95, సర్జికల్‌ మాస్క్‌లపై మాత్రం నిషేధం కొనసాగించింది....

Published : 16 May 2020 21:09 IST

దిల్లీ: విదేశాలకు మాస్క్‌లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాటన్‌, పట్టు, ఉన్ని సహా నాన్‌ మెడికల్‌, నాన్‌ సర్జికల్‌ మాస్క్‌లపై ఆంక్షలను ఎత్తేసింది. అయితే ఎన్‌-95, సర్జికల్‌ మాస్క్‌లపై మాత్రం నిషేధం కొనసాగించింది.

‘నాన్‌ మెడికల్‌/నాన్‌ సర్జికల్‌ మాస్క్‌ల ఎగుమతికి ప్రభుత్వం అనుమతించింది’ అని డీజీఎఫ్‌టీ తెలిపింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అన్ని రకాల మాస్క్‌లు, అందుకు అవసరమైన ముడిసరుకు ఎగుమతులపై మార్చి 19న ప్రభుత్వం నిషేధం విధించింది. పీపీఈ కిట్లు, గాల్లో వైరస్‌ కణాలను అడ్డుకొనే మాస్క్‌ల ఎగుమతులపై జనవరి 31నే నిషేధం అమలు చేసిన సంగతి తెలిసిందే.

ఆంక్షలను సడలించాలని ఎగుమతిదారులు డిమాండ్‌ చేయడంతో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ‘ఇది స్వాగతించదగ్గ చర్య. ఇందుకోసం మేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు మాకు భారీ ఆర్డర్లు ఉన్నాయి. రాబోయే మూడు నెలల్లో వందల కోట్ల డాలర్ల విలువైన మాస్క్‌లు ఎగుమతి చేస్తామని అంచనా’ అని భారత అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఏ శక్తివేల్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని