పండు పడింది... నిజం తెలిసింది!

కల్పన కంటే నిజం మరింత విచిత్రంగా ఉంటుందంటారు. అది నిజమే అనిపించే ఓ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

Updated : 25 May 2020 13:24 IST

కన్నూరు: కల్పన కంటే నిజం మరింత విచిత్రంగా ఉంటుందంటారు. అది నిజమే అనిపించే ఓ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. గాయపడి ఆస్పత్రికి వెళ్లిన ఓ ఆటో డ్రైవర్‌కు కొవిడ్‌-19 ఉన్నట్టు తేలింది! కన్నూరులోని పరియారం వైద్య కళాశాల అధికారుల కథనం ప్రకారం... కాసరగోడ్‌ జిల్లాలోని బేలూరుకు చెందిన ఓ వ్యక్తి పనసపండును తెంపబోయాడు. కాగా, వాటిలో ఒకటి అతని తలపై పడటంతో... గాయపడ్డాడు.  కాళ్లు, చేతులకు కూడా దెబ్బలు తగిలాయి. ఇతనికి శస్త్రచికిత్స జరపాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుత వైద్య నిబంధనల ప్రకారం, ఇతర పరీక్షలతో పాటు ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షను కూడా చేశారు. వెలువడ్డ ఫలితాల్లో అతనికి కరోనా ఉన్నట్టు తేలింది.

ఈ ఆటో డ్రైవర్‌ గతంలో విదేశాలకు వెళ్లటం కానీ, ఆయన సంబంధీకుల్లో ఎవరికీ ఇప్పటి వరకు కరోనా సోకలేదు. దీనితో అతని ఆటోలో ప్రయాణించిన వారి నుంచి  సోకిఉంటుందని లేదా గతంలో జిల్లా ఆస్పత్రికి వెళ్లటంతో అక్కడైనా సోకి అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని