గోవా పది పరీక్షలో వివాదాస్పద ప్రశ్న..

గోవాలో గతవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్‌ పేపర్‌లో వచ్చిన ఓ వివాదాస్పద ప్రశ్న.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ ప్రశ్న.. అక్కడి ప్రభుత్వ...

Published : 25 May 2020 22:39 IST

రాజకీయ దుమారం.. విచారణకు ఆదేశం

పనాజి: గోవాలో గతవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లీష్‌ పేపర్‌లో వచ్చిన ఓ వివాదాస్పద ప్రశ్న.. రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈ ప్రశ్న.. అక్కడి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఆ పరీక్షలో ఉద్యోగాల నియామాకాల్లో అవినీతికి సంబంధించిన అంశాలు పేర్కొనడంతో అది ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని అధికార భాజపా నాయకులు మండిపడ్డారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్‌ చేసింది. 

గతవారం జరిగిన ఇంగ్లీష్‌ పేపర్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఇక్కడ ఉద్యోగాలు రావాలంటే భయంగా ఉందని, పలుకుబడి లేదా డబ్బు ఉంటేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయని, అందుకే తాను పోర్చుగల్‌లో ఉపాధి పొందాలనుకుంటున్నట్లు అంటాడు. ఇది వివాదాస్పదంగా ఉండడంతో రెండు పార్టీల మధ్య దుమారం చెలరేగింది. ఇంగ్లీష్‌ పేపర్‌లో ఈ ప్రశ్న ఎలా వచ్చిందనే విషయంపై విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ అధికారి రామకృష్ణ సమంత్‌ సోమవారం మీడియాకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని