నిండు గర్భిణిని ఆసుపత్రిలోకి అనుమతించక..

గర్భిణిలు ఎలాంటి అవస్థ పడకుండా సుఖప్రసవం కావాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు

Published : 01 Jun 2020 00:57 IST

థానే: గర్భిణిలు ఎలాంటి అవస్థ పడకుండా సుఖ ప్రసవం కావాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అయినప్పటికి రోడ్లపై, వాహనాలలో ప్రసవాలు జరిగి ఎందరో తల్లులు మృత్యవాత పడుతూనే ఉన్నారు. తాజాగా మహరాష్ట్ర.. థానేలో ఒక గర్భిణిని ఆసుపత్రి సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో ఆటో రిక్షాలోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మే 26న నిండు గర్భిణి అయిన ఆస్మా మెహందీ(26) పురిటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఆటోరిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొదట ‘బిలాల్‌’ అనే ఆసుపత్రికి వెళ్లగా వారు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత వరుసగా క్రిటికేర్, యూనివర్సల్‌ ఆసుపత్రులకు వెళ్లగా వారు కూడా నిరాకరించారు. ఈ క్రమంలోనే ఆస్మా పురిటినొప్పులకు తాళలేక ఆటోరిక్షాలోనే మరణించింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆ మూడు ఆసుపత్రుల యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియోక్లిప్‌ను భాజపా నేత రామ్‌కదమ్‌ ట్వీట్‌ చేస్తూ.. మహరాష్ట్ర ప్రభుత్వం కరోనావేళ ప్రజలను రక్షించడంలో ఎలా విఫలమైందో ఈ ఘటనే నిదర్శనమని రాసుకొచ్చారు. ఈ ఘటన తనను షాక్‌ గురిచేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని