అచ్చెన్న కుటుంబసభ్యులకు చంద్రబాబు ఫోన్

కక్షసాధింపులో భాగంగానే టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ

Updated : 12 Jun 2020 12:10 IST

అమరావతి: కక్షసాధింపులో భాగంగానే టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు. అచ్చెన్న అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబు, లోకేశ్‌లు ఫోన్‌లో మాట్లాడారు. సంఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని చంద్రబాబుకు అచ్చెన్న కుటుంబసభ్యులు తెలిపారు. తమతో మాట్లాడే అవకాశం లేకుండా తీసుకెళ్లారని వివరించారు. అచ్చెన్న కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారులపై ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెస్తోందో బయటపడిందని ఆయన విమర్శించారు. అచ్చెన్న అరెస్టుతో మరోసారి జగన్‌ కుట్ర బయటపడిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని