
Published : 25 Jun 2020 02:44 IST
తన పదవికి IPS వీకే సింగ్ రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి సీనియర్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శికి పంపారు. గత కొంత కాలంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.
గాంధీ జయంతి రోజున పదవీ విరమణ ఇవ్వాలని వీకే సింగ్ కేంద్రాన్ని కోరారు. పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలనే ఆశయం తనకు ఉండేదన్నారు. సంస్కరణల అమలులో సఫలం కాలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. తన సర్వీస్ పట్ల ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుందని వీకే సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి తాను భారం కాదల్చుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో కంటే బయటే తన సేవలు అవసరమన్నారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు.
Tags :