తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు 

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన

Updated : 26 Jun 2020 23:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఈ రోజు 78 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,766కు చేరుకుంది. ప్రస్తుతం 7,436 మంది కరోనాతో పోరాడుతున్నారు. 24 గంటల్లో 4,374 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తం 75,308 మందిని పరీక్షించారు. 


ఇక అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 774 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 53, వరంగల్‌ అర్బన్‌లో 20, మెదక్‌లో 9, ఆదిలాబాద్‌లో 7, నాగర్‌కర్నూల్‌లో 6, నిజామాబాద్‌లో 6, రాజన్న సిరిసిల్లాలో 6, సిద్దిపేటలో 3, ములుగులో 2, వికారాబాద్‌లో 1, మహబూబ్‌నగర్‌లో 1, జగిత్యాలలో 2, జయశంకర్‌ భూపాలపల్లిలో 3, ఖమ్మంలో 3, యాదాద్రి భువనగిరిలో 2, మిర్యాలగూడలో 1 కేసులు నమోదు అయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని