టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన కేంద్రబృందం

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర...

Published : 29 Jun 2020 10:15 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దిల్లీ నుంచి వచ్చిన కేంద్ర పర్యవేక్షక బృందం గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించింది.  టిమ్స్‌లోని ఐసోలేషన్‌, ఐసీయూ గదులను బృందంలోని అధికారులు పరిశీలించారు.

ఈ రోజు నగరంలోని కంటైన్మెంట్‌ జోన్లను, గాంధీ ఆసుపత్రిని కూడా కేంద్ర బృందం సందర్శించనుంది. కొవిడ్‌-19 నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్యం, వారికి సమకూర్చిన సదుపాయాలు, ఆసుపత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది పనితీరు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించనుంది. అనంతరం బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని