ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నివేదిక సిద్ధం

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై హైలెవల్‌ కమిటీ నివేదిక సిద్ధమైంది. మధ్యాహ్నం 12.30గంటలకు ఏపీ సీఎం జగన్‌కు హైలెవల్‌ కమిటీ నివేదిక సమర్పించనుంది. మే నెలలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌లీక్‌ అయిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 11 మంది మృతి చెం

Published : 06 Jul 2020 11:25 IST

నేడు ఏపీ సీఎంకు అందించనున్న అత్యున్నత స్థాయి కమిటీ

అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై హైలెవల్‌ కమిటీ నివేదిక సిద్ధమైంది. మధ్యాహ్నం 12.30గంటలకు ఏపీ సీఎం జగన్‌కు ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. మే నెలలో ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమలో గ్యాస్‌లీక్‌ అయిన విషయం తెలిసిందే ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 200 మందికిపైగా స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ, అధ్యయనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు పరిశ్రమను పరిశీలించి, వెంటకటాపురంలోని ప్రజలను విచారించి నివేదిక సిద్ధం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని