Omicron: శ్రీకాకుళం జిల్లాలో ‘ఒమిక్రాన్‌’ కలకలం..!

సంతబొమ్మాళి మండలంలోని ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ బారిన పడ్డారనే విషయం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇది జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 08 Dec 2021 09:24 IST

సంతబొమ్మాళి, గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ బారిన పడ్డారనే విషయం మంగళవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇది జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి గత నెల 23న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా నెగిటివ్‌ వచ్చింది. ఇంటికొచ్చాక జ్వరం రావడంతో ఈ నెల 5న స్థానిక పీహెచ్‌సీలో మరోసారి పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో ఆయన విదేశాల నుంచి రావడంతో కరోనా కాదు ఒమిక్రానే అయి ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలు హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక రావాల్సి ఉంది. ప్రస్తుతం బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నగరంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ విషయమై కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ మాట్లాడుతూ నివేదిక వచ్చిన తర్వాత ఒమిక్రాన్‌ అవునా? కాదా? అనేది తెలుస్తుందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని