Rajamahendravaram: వైకాపా దుశ్చర్య.. రైతుల పాదయాత్రపైకి వాటర్‌ బాటిళ్లు..

మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైకాపా శ్రేణుల కవ్వింపులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న  రైతులను రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు వాటర్‌ బాటిళ్లు విసిరారు.

Updated : 18 Oct 2022 13:03 IST

రాజమహేంద్రవరం: మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై వైకాపా శ్రేణుల కవ్వింపులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో పాదయాత్రగా వెళ్తున్న  రైతులను రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు వాటర్‌ బాటిళ్లు విసిరారు. ఆజాద్‌ చౌక్‌ మీదుగా శాంతియుతంగా రైతులు, అఖిలపక్ష నేతలు వెళ్తుండగా నల్లబెలూన్లు ప్రదర్శిస్తూ వైకాపా శ్రేణులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇటు అమరావతి రైతులు, అటు వైకాపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తున్నారు.

వైకాపా కార్యకర్తలను ఆ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌ రెచ్చగొట్టడంతోనే వారు పాద యాత్రికులపై వాటర్‌ బాటిళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైకాపా దుశ్చర్యను వివిధ పార్టీల నేతలు ఖండించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని