Guntur: మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు: గుంటూరు జిల్లా కోర్టు

మార్గదర్శి ఆస్తుల జప్తుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని గుంటూరు జిల్లా కోర్టు స్పష్టం చేసింది.

Updated : 11 Dec 2023 21:52 IST

గుంటూరు: మార్గదర్శి సంస్థ ఆస్తుల జప్తుపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చెల్లవని గుంటూరు జిల్లా కోర్టు స్పష్టం చేసింది. సీఐడీ ప్రతిపాదన మేరకు ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మార్గదర్శి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన జడ్జి..  మూడు రకాలు ఆస్తుల జప్తు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆ సంస్థ ఆస్తుల జప్తునకు సంబంధించిన జీవోలు చెల్లవని తెలిపింది. ‘‘మార్గదర్శి తప్పు చేసినట్లు ఎక్కడా రుజువుల్లేవు. ఖాతాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిందని నిరూపించలేకపోయారు. జప్తు చేసేందుకు సరైన కారణాలు చూపించలేకపోయారు’’ అని జిల్లా కోర్టు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని