ఫొటో తీస్తే...దెబ్బలు పడతాయి..

ఇదేం చోద్యం అనుకోకండి. సాధారణంగా మనకు నచ్చకుండా ఎవరూ ఫొటోలు తీయడానికి అంగీకరించం. జంతువులు కూడా వీటికి అతీతం కాదని ఈ ఏనుగునిరూపించింది. జంతువులు మనుషులతో బంధం పెనవేసుకున్న చాలా వీడియోలను తరచూ చూస్తునే ఉంటాం. నిజానికి కొన్ని పూర్తి స్థాయిలో సౌకర్యవంతంగా ఉండవని ఈ వీడియో

Published : 25 May 2022 00:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇదేం చోద్యం అనుకోకండి. సాధారణంగా మనకు నచ్చకుండా ఎవరూ ఫొటోలు తీయడానికి అంగీకరించం. జంతువులు కూడా వీటికి అతీతం కాదని ఈ ఏనుగు నిరూపించింది. ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేసిన ఒక వీడియో అందుకు ఉదాహరణ...ఈ వీడియోలో జూలో సందర్శనకు వచ్చిన పర్యాటకులతో ఏనుగు ఆడుకుంటూ చాలా ప్రశాంతంగా కనిపించింది. దాని తొండాన్ని తాకుతూ మురిసిపోతున్న సందర్శకులకు వినోదాన్ని పంచింది. కానీ ఒక అమ్మాయి ఏనుగును ఫొటో తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా తొండంతో ఆ బాలికను కొట్టింది. దాంతో బాలిక కింద పడిపొయింది. ఏనుగు ఫోన్‌ తీసుకోడానికి ప్రయత్నిస్తుండటం గమనించిన ఓ పర్యాటకుడు ఫోన్‌ను దాని నుంచి దూరంగా జరిపేశాడు.
ట్విటర్‌లో పోస్ట్‌ అయిన ఈ వీడియోను చూసి జంతుప్రేమికులు మరి వాటికి కోపం తెప్పిస్తే ఇలానే ఉంటాది అని కామెంట్లు  పెడుతున్నారు. జంతువులను మచ్చిక చేసుకోవడం అంత సులభం కాదని కూడా అంటున్నారు. జంతు ప్రదర్శనశాలలో అత్యుత్సాహంతో చేసిన తప్పిదాలు ఇలాంటి ఘటనలకు దారితీస్తాయి. ఇటీవల మృగరాజు జూకీపర్‌ వేలు కోరికేసిన ఘటన చూశాం. జాగ్రత్త సుమండీ..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని