జగిత్యాల: పాలపై సీతారాముల చిత్రాలు

జగిత్యాల జిల్లా రాఘవపట్నంకు చెందిన సూక్ష్మ కళాకారుడు చోళేశ్వర్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని పాల మీద పలు రకాల రంగులతో సీతారాముల చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దారు....

Published : 22 Apr 2021 01:32 IST

రాఘవపట్నం: జగిత్యాల జిల్లా రాఘవపట్నంకు చెందిన  కళాకారుడు చోళేశ్వర్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని పాల మీద పలు రకాల రంగులతో సీతారాముల చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. వేములవాడలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఆర్ట్స్ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చోళేశ్వర్ సమయం దొరికినప్పుడల్లా సూక్ష్మ చిత్రకళతో ఆకట్టుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పాలపై తీర్చిదిద్దిన సీతారాముల చిత్రాన్ని కేవలం 15 నిమిషాల్లోనే గీసినట్లు ఆయన వెల్లడించారు. చోళేశ్వర్ ప్రతిభను పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతితో పాటు సహా ఉపాధ్యాయులు అభినందించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని