Andhrapradesh news: 100 శాతం పన్ను వసూలు చేయకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తాం..!

విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్యదర్శులు చెత్త పన్ను వంద శాతం లక్ష్యాలను వసూలు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సర్క్యలర్‌ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది.

Updated : 31 Mar 2022 05:14 IST

విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్యదర్శులు చెత్త పన్ను వంద శాతం లక్ష్యాలను వసూలు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సర్క్యలర్‌ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. నిర్దేశించిన లక్ష్యాల మేరకు చెత్త పన్ను వసూలు చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని పార్వతీపురం పురపాలక కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటామంటూ ప్రత్యేక మెమో జారీ చేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. చెత్త పన్ను వసూలుకు ఏప్రిల్ 6 వరకు గడువు ఇచ్చారు. అప్పటికి లక్ష్యాలను చేరుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని