Krishna Tribunal: ఏపీ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కృష్ణా ట్రైబ్యునల్‌

రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా  కృష్ణా జలాల వివాదంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు జూన్‌ వరకు సమయమివ్వాలని ఏపీ విజ్ఞప్తి చేయగా.. కృష్ణా ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. 

Published : 08 Apr 2024 19:19 IST

హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంలో పూర్తి వివరణ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా జూన్‌ వరకు సమయమివ్వాలని విజ్ఞప్తి చేయగా.. కృష్ణా ట్రైబ్యునల్‌ తోసిపుచ్చింది. మరోవైపు ఏపీ విజ్ఞప్తిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్‌ కేసులకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాదని వాదించింది. కాలయాపన కోసమే ఏపీ గడువు కోరుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న ధర్మాసనం.. జూన్‌ వరకు గడువు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ నెల 29 లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత 2 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని