Laparoscopy: అత్యవసరమైతే లాప్రోస్కోపీ ఎంతో మేలు

ఆపరేషన్‌ అనగానే పెద్ద పెద్ద కోతలు..పది, పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, భారీ ఖర్చు కళ్ల ముందు కదలాడుతుంది..కానీ ఇపుడు లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బే కాదు.. సమయం కలిసి వస్తుంది. రోగి కూడా తొందరగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

Published : 12 Aug 2022 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆపరేషన్‌ అనగానే పెద్ద పెద్ద కోతలు.. పది, పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం.. భారీ ఖర్చు కళ్ల ముందు కదలాడుతుంది. కానీ.. ఇపుడు లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డబ్బే కాదు.. సమయమూ కలిసి వస్తోంది. రోగి కూడా తొందరగా కోలుకుంటున్నాడని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగి పొట్ట లోపల రక్తస్రావం జరిగినా, పేగుల్లో సమస్య వచ్చినా వెంటనే తెలుసుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటోందని ప్రముఖ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు పివీ రమణ మూర్తి వివరించారు.

* అత్యవసరంగా లాప్రోస్కోపీ చేయాలంటే అనుభవజ్ఞులైన వైద్యులు, సిబ్బంది, సాంకేతికత కలిగిన థియేటర్‌ అందుబాటులో ఉండాలి.

* పొట్టకు దెబ్బ తగిలినపుడు లాప్రోస్కోపీ చాలా ఉపయోగ పడుతుంది. గతంలో పొట్టను ఓపెన్‌ చేస్తే తప్పా తెలిసేది కాదు. 

* ఇన్‌ఫెక్షన్‌ లేకుండా రోగిని చూసుకోవచ్చు. తొందరగా ఇంటికి పంపించడానికి వీలవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని