HMWSSB: మంజీరా నీటి సరఫరాకు రెండ్రోజులు అంతరాయం.. ఏఏ ప్రాంతాల్లో అంటే?

నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. 

Updated : 16 Aug 2023 19:52 IST

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ నెల 19న ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోనుంది. మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న మంజీరా వాటర్‌ సప్లై ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్‌కు జంక్షన్‌ పనులు జరగనున్నాయి. ఆర్‌అండ్‌బీ శాఖ బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్‌ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్‌ పనులు చేపట్టనున్నారు.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే..

  • ఓఅండ్ఎం డివిజన్ నెం.6 : ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్ పేట్ (తదితర ప్రాంతాల్లో పాక్షిక అంతరాయం)
  • ఓఅండ్ఎం డివిజన్ నెం.8 : ఈ డివిజన్ పరిధిలోని ఆఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు
  • ఓఅండ్ఎం డివిజన్ నెం.9 : కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో తాగు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
  • ఓఅండ్ఎం డివిజన్ నెం.15 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్.
  • ఓఅండ్ఎం డివిజన్ నెం.24 : బీరంగూడ, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ ప్రాంతాల్లో వినియోగదారులు మంజీరా తాగు నీరు పొదుపుగా వాడుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు