
TS News: మధుకర్‌ది హత్యే: మావోయిస్టుల లేఖ
హైదరాబాద్: మావోయిస్టు నేత మధుకర్‌ను పోలీసులే క్రూరంగా హింసించి హత్య చేశారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు దక్షిణ సబ్ జోనల్ పేరుతో దండకారణ్య అధికార ప్రతినిధి సమత లేఖ విడుదల చేశారు. కరోనా బారిన పడి చికిత్స కోసం వచ్చిన మధుకర్‌ను ఈ నెల ఒకటో తేదీ వరంగల్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడికి కనీసం వైద్య సేవలు అందించకుండా ఐదు రోజుల పాటు హింసించారని.. ఆరో తేదీన అనారోగ్యంతో చనిపోయినట్లు ప్రకటించారని సమత ఆరోపించారు. గత నెల 27న ప్లాటూన్ కమాండర్ గంగాల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు పేర్కొన్నారు. మధుకర్‌కు శ్రద్ధాంజలి ఘటించిన దక్షిణ సబ్ జోనల్ బ్యూరో.. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని లేఖలో పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.