Koppula Eshwar: ఎన్నిక వివాదం.. మంత్రి కొప్పుల పిటిషన్‌ కొట్టివేత

తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

Updated : 01 Aug 2023 12:47 IST

హైదరాబాద్‌: తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించాలని కోరుతూ తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి అక్రమ పద్ధతుల్లో కొప్పుల ఈశ్వర్‌ గెలిచారని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈశ్వర్‌ స్థానంలో తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరారు. లక్ష్మణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలంటూ కొప్పుల ఈశ్వర్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు