
Hyd News: త్వరలో అందుబాటులోకి భారీగా మెడికల్ సీట్లు: మంత్రి సబిత
హైదరాబాద్: కొవిడ్ సమయంలో వైద్యులందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కుటుంబాలను వదిలి రోజుల తరబడి రోగులకు సేవలు చేశారని కొనియాడారు. యశోదా ఆస్పత్రి 10వ వార్షిక యంగ్ డాక్టర్స్ క్యాంప్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడారు.
‘‘ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది. నగరానికి నలుమూలలా నాలుగు సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. త్వరలో మెడికల్ సీట్లు భారీగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కష్టం వచ్చినప్పుడే బలంగా నిలబడాలి. ఏ రంగం ఎంచుకున్నా నిబద్ధత, మానవత్వంతో నడుచుకోవాలి. ఒకప్పుడు ఆడపిల్లలను చదివించాలంటే ఆలోచించే పరిస్థితి ఉండేది. మోడల్ స్కూల్స్‌లో పరీక్ష పెట్టినప్పుడు చాలా మంది విభిన్న రకాల వృత్తులను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపారు. ఒక పోర్టల్ ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం కెరీర్ గైడెన్స్ ఇస్తోంది’’ అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
వైద్య విద్యపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు దానిపై మరింత అవాగాహన కల్పించేందుకు పదేళ్లుగా యశోదా ఆస్పత్రి యంగ్ డాక్టర్స్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
General News
Cesarean Care: శస్త్రచికిత్స తర్వాత ఏం జరుగుతుందంటే...!
-
Technology News
Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్!
-
General News
HMDA: హెచ్ఎండీఏ ఈ-వేలానికి ఆదరణ.. తుర్కయాంజిల్‌లో గజం రూ.62,500
-
General News
Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో మీటింగ్.. అభిమాని భావోద్వేగం
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Eknath Shindhe: నాడు ఆటో నడిపారు.. ఇకపై మహారాష్ట్రను నడిపిస్తారు..
- YSRCP: గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని
- iPhone 12: యాపిల్ ఐఫోన్ 12పై ఆఫర్..₹ 20 వేల వరకు తగ్గింపు!
- Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే
- Income Tax Rules: రేపటి నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Revanthreddy: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు సిద్ధంగా లేము: రేవంత్‌రెడ్డి
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
- Raj Thackeray: అన్న రాజీనామా.. రాజ్ ఠాక్రే కీలక ట్వీట్