‘‘కరోనా కట్టడికి సీఎం చర్యలు తీసుకుంటున్నారు’’

కరోనా కట్టడికి సీఎం నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని, మంత్రి ఈటల రాజేందర్‌నిత్యం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో వైద్యాధికారులతో మంత్రులు ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 11 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు,

Published : 27 Jul 2020 01:24 IST

తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి

కామారెడ్డి: కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని, మంత్రి ఈటల రాజేందర్‌ నిత్యం వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో వైద్యాధికారులతో మంత్రులు ఈటల రాజేందర్‌, ప్రశాంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాకు 11 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఐదుగురు ఫార్మాసిస్టులు, 68 ఎంపీహెచ్‌ మహిళా సిబ్బందిని నియమించాలని ఈ సందర్భంగా మంత్రులను కలెక్టర్‌ కోరారు. జిల్లాలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి రూ. 5 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రులు సానుకూలంగా స్పందించారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి ఆస్పత్రిలో ఆక్సిజన్‌సౌకర్యం ఉందని, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు మరింత నిబద్ధతతో సేవ చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఎలాంటి సదుపాయాలైనా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు