TSPSC:పేపర్ లీకేజీ.. నలుగురు నిందితులకు కస్టడీ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. ఏ1 నిందితుడు ప్రవీణ్‌తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్‌లను కస్టడీకి అప్పగించింది. ఈ నలుగురు నిందితులను రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. మిగతా ముగ్గురు నిందితులు ఏ-10, ఏ-11, ఏ-12ల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.
విచారణ సమయంలో సిట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలీసు కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం తెలపలేదని కోర్టుకు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారన్నదానిపై నిందితులు నోరు విప్పడం లేదన్నారు. కేవలం ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని, మిగతావారి పాత్ర బయటపడాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పేపర్ లీకేజీకి ఉపయోగించిన పరికరాలపై నిందితులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Tirumala Ghat Road: వాహనాలను నియంత్రించకుంటే నష్టమే.. తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు
-
Sports News
MS Dhoni: ధోని.. మోకాలి గాయాన్ని బట్టే తుదినిర్ణయం: సీఎస్కే సీఈవో విశ్వనాథన్
-
Crime News
Khammam: లారీని ఢీకొన్న కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
Crime News
Gang rape: విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్.. కాలిన గాయాలతో మృతి
-
Sports News
Virat Kohli: కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..