ఆక్స్‌ఫర్డ్ టీకా రెండోదశ ట్రయల్స్‌ ప్రారంభం

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ పుణెలో ప్రారంభమయ్యాయి.

Published : 27 Aug 2020 00:40 IST

పుణె: ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ పుణెలో ప్రారంభమయ్యాయి. భారతీ విద్యాపీఠ్‌ కళాశాలతో పాటు ఆసుపత్రిలో ప్రయోగ పరీక్షలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రిటీష్‌ స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకాను ఉత్పత్తి చేసేందుకు పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఐదుగురికి కొవిడ్‌ యాంటీబాడీస్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో ముగ్గురికి యాంటీబాడీస్‌ పాజిటివ్‌గా రావడంతో క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి తప్పించారు. టీకా వేసుకున్న ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారం రోజులపాటు 25 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని