Yoga: మైసూర్‌ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం!

ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మైసూర్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. కరోనా మహమ్మారి..........

Published : 24 May 2022 01:10 IST

దిల్లీ: ఏటా జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మైసూర్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించనున్నారు. దీనిపై ఆయుష్‌శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. ‘దేశమంతా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’ జరుపుకొంటోంది. అందుకే దేశంలోని 75 ప్రాంతాల్లో ఈ యోగా దినోత్సవ ఉత్సవాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ఇందులో భాగంగా మే 27న హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. దాదాపు 10,000 మంది యోగా ఔత్సాహికులు ఈ యోగా ప్రదర్శనలో పాల్గొననున్నారు. మైసూర్‌లో జరిగే ప్రధాన కార్యక్రమం కాకుండా, గార్డియన్‌ రింగ్‌, రిలే యోగా స్ట్రీమింగ్‌ ఈవెంట్‌ కూడా ఈ ఏడాది మరో ఆకర్షణగా నిలువనున్నాయి. విదేశాల్లో భారతీయ మిషన్లు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను డిజిటల్‌ వేదికగా ప్రదర్శించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని