Pregnant: గర్భిణులకు కరోనా సోకినా.. శిశువు క్షేమమే!

కరోనాకి సంబంధించిన గర్భిణులకు అనేక భయాందోళనలు ఉన్నాయి. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో బిడ్డకూ సోకుతుందా? ప్రసవం తర్వాత కరోనా సోకితే.. తల్లి పాలు తాగే శిశువులు కూడా కరోనా బారిన పడతారా వంటి అనేక సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, తాజాగా వీటికి సమాధానం

Published : 27 Dec 2021 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విషయంలో గర్భిణులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గర్భిణులకు కరోనా సోకితే కడుపులో బిడ్డకూ సోకుతుందా? ప్రసవం తర్వాత కరోనా సోకితే.. తల్లి పాలు తాగే శిశువులు కూడా కరోనా బారిన పడతారా వంటి అనేక సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే, తాజాగా వీటికి సమాధానం దొరికింది. గర్భిణులకు కరోనా సోకినా.. బిడ్డకు వచ్చే ప్రమాదం ఏమీ లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను ఇటీవల ఒక జర్నల్‌లో  ప్రచురించారు. 

కరోనా సోకిన గర్భిణులకు జన్మించిన శిశువుల్లో కరోనా జాడ లేదని, శిశువు ఆరోగ్యం.. పెరుగుదల సాధారణంగానే ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. పరిశోధనలో భాగంగా వ్యాక్సిన్‌ వేసుకోకముందే కరోనా బారిన పడిన కొంతమంది గర్భిణులపై ఆరు నెలలపాటు అధ్యయనం చేశారు. వారిలో 55శాతం మందికి ప్రసవం జరిగిన 10 రోజుల్లోపే కరోనా సోకింది. అయితే, వారికి జన్మించిన శిశువులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికీ కరోనా పాజిటివ్‌గా రాలేదని పరిశోధక బృందం వెల్లడించింది. వీరంతా ఈ ఏడాది ఏప్రిల్‌-జులై మధ్య జన్మించిన శిశువులు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిన వేళ ఇదొక ఊరటనిచ్చే విషయమని జర్నల్‌ సీనియర్‌ రచయిత, పిల్లల వైద్యురాలు, ఫీన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్ మెడిసిన్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మల్లికా షా తెలిపారు.

Read latest General News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని