Andhra News: రమణదీక్షితులు వివాదాస్పద ట్వీట్‌పై తితిదే అర్చకుల కౌంటర్‌

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తితిదే

Updated : 28 Sep 2022 20:55 IST

తిరుమల: శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వివాదాస్పద ట్వీట్‌పై తితిదే అర్చకులు ఘాటుగా స్పందించారు. ఈ విషయంపై మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. ఏకసభ్య కమిటీలో ప్రస్తావించిన అంశాలేవో తెలియదు. అర్చకులందరూ కలిసి స్వామివారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నాం. తిరుమలలో అర్చక వ్యవస్థ సవ్యంగా, సంతృప్తికరంగానే ఉంది. సీఎం జగన్‌తో నాలుగు కుటుంబాల అర్చకులం సమావేశమయ్యాం. 142 సెక్షన్‌ ప్రకారం మమ్మల్ని క్రమబద్ధీకరించారు. మా పిల్లలు కూడా శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పించారు. 1997లో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మిరాశీదారులను ఉద్యోగులుగా తీసుకున్నారు. జీవో నెం.855 ప్రకారం మా సేవలను క్రమబద్ధీకరించారు. సెక్షన్‌ 142 ప్రకారం మాకు గౌరవ మర్యాదలు అందుతున్నాయి’’ అని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

రమణదీక్షితులు ఏమన్నారంటే..

తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు. తితిదేలోని బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతో పాటు, అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సిఫార్సులపై సీఎం జగన్‌ ప్రకటన చేయకపోవడం నిరాశపర్చిందని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని