ఎర్రకోట ఈ నెల 31 వరకు మూసివేత 

ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తూ పూరాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Published : 28 Jan 2021 01:16 IST

దిల్లీ: ఎర్రకోటను ఈ నెల 31 వరకు మూసివేస్తూ పూరాతత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలకు సందర్శించేందుకు అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాగు చట్టాలను రద్దు చేయాంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకమైన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమకు కేటాయించిన మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఎర్రకోటను ముట్టడించి ఆధ్మాత్మిక జెండాలను ఎగురవేశారు. దీంతో అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు దాడి చేశారు. 

ఇదీ చదవండి..

రైతు ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని