Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్షకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..!

సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు రైల్వేశాఖ......

Published : 06 May 2022 15:45 IST

దిల్లీ: సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం 65 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ఆయా రైళ్లను నడిపే తేదీలతో పాటు బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను పేర్కొన్నారు.

ప్రత్యేక రైళ్లలో రుసుమును విద్యార్థులే చెల్లించాలని,  రాయితీలేమీ ఉండవని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. హైదరాబాద్‌- మైసూర్‌, సికింద్రాబాద్‌- విశాఖ; జబల్పూర్‌- నాందేడ్‌, గుంటూరు- నాగర్‌సోల్‌, హతియా-చీరాల; నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ పట్టణం- మైసూర్‌; ఆదిలాబాద్‌- చెన్నై సెంట్రల్‌; హుబ్బళి- ఔరంగాబాద్‌; ఢోన్‌- విజయవాడ; కాకినాడ పట్టణం- కర్నూలు నగరం; మచిలీపట్నం- ఎర్నాకుళం; కడప- విశాఖ; చీరాల-షాలిమార్‌ తదితర స్టేషన్ల మధ్య అభ్యర్థులకు సేవలందించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని