కరోనాపై సంగారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు వాహనాలకు ముందువైపు భారీ మాస్కులు కట్టి వీధుల్లో తిప్పుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు....

Published : 21 Apr 2021 11:30 IST

సంగారెడ్డి: కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసు వాహనాలకు ముందువైపు భారీ మాస్కులు కట్టి వీధుల్లో తిప్పుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. మహమ్మారి విజృంభిస్తున్న వేళ మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు.

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొవిడ్‌ కేసులు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 6,542 మంది వైరస్‌ బారిన పడ్డారు. 20 మంది మృతిచెందారు. కాగా మొత్తం మృతుల సంఖ్య 1,876కు చేరింది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని