Telangana News: గ్రూప్‌-2, 3, 4లో మరికొన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం

గ్రూప్‌-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది.

Published : 24 Nov 2022 16:55 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్‌-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్‌-3లో మరో రెండు, గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్‌-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌,  అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉంటాయి. గ్రూప్‌-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను చేర్చారు. గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌ వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులు చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని