Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Special trains extended: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుుకుని పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది. అక్టోబర్‌ ఒకటో తేదీ వరకు ఆయా రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Updated : 22 Jul 2023 15:23 IST

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (South central railway) పలు ప్రత్యేక రైళ్లను (Special trains) పొడిగించింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్‌- కటక్‌; తిరుపతి-జల్నా; జల్నా- చాప్రా; హైదరాబాద్‌- గోరక్‌పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 1 తేదీల మధ్య నిర్దేశించిన తేదీల్లో ఆయా రైళ్లు నడుస్తాయి.

స్కూల్‌కు సెలవు పెట్టకుండా 50 దేశాలను చుట్టేసిన పదేళ్ల చిన్నారి.. అదెలాగో తెలుసా..!

మరోవైపు ద.మ.రైల్వే పరిధిలోని 4 రైల్వేస్టేషన్లలో జనాహారం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ గుంతకల్లు, రేణిగుంటలలో రైళ్ల సాధారణ బోగీలు ఆగేచోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు జోన్‌ తెలిపింది. రూ.20కి ఎకానమీ భోజనం, రూ.50కి కాంబో భోజనం లభిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. సాధారణ ప్రయాణికులకు జనాహారం ఉపయోగకరంగా ఉంటుందని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. ఈ 4 స్టేషన్లలో ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వంటశాలలు ఉండటంతో వాటిద్వారా జనాహారాన్ని ద.మ.రైల్వే అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

పొడిగించిన ప్రత్యేక రైళ్లు ఇవే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని