APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. సాధారణ ఛార్జీలే వసూలు

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది. జనవరి 6 నుంచి 18వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలును చేయాలని నిర్ణయించింది. 

Published : 15 Dec 2022 02:19 IST

అమరావతి: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించింది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ సర్వీసులు నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని