Anand Mahindra: నేను అలా అనలేదు.. అది ఫేక్‌న్యూస్‌

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేసే ప్రతీ వార్తకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలపై ప్రభావం చూపే..  అనుభవాలు, ఆలోచనలను ట్వీట్‌ చేస్తుంటారు. తాజాగా ‘‘ మీ జీవితాన్ని మార్చుకునే సలహా ఇది’’ అంటూ ఆయన పేరు వచ్చిన ఓ న్యూస్‌ వైరల్‌ అయింది. అదేంటంటే.. ‘‘స్కూల్స్‌లో స్టాక్‌ మార్కెట్‌ ట్రెండింగ్‌ని కచ్చితంగా బోధించాలి.

Published : 04 Sep 2021 01:19 IST

ట్వీటర్‌ వేదికగా స్పందించిన ఆనంద్‌ మహీంద్రా

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేసే ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజలపై ప్రభావం చూపే అనుభవాలు, ఆలోచనలను ఆయన ట్వీట్‌ చేస్తుంటారు. తాజాగా ‘‘ మీ జీవితాన్ని మార్చుకునే సలహా ఇది’’ అంటూ ఆయన పేరుతో వచ్చిన ఓ న్యూస్‌ వైరల్‌ అయింది. అదేంటంటే.. ‘‘స్కూల్స్‌లో స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ని కచ్చితంగా బోధించాలి. కానీ అలా ఎందుకు చేయడం లేదో నేను చెబుతా’’ అంటూ ఆనంద్‌ మహీంద్ర ఓ ప్రసంగంలో చెప్పిన వార్త అంటూ చర్చనీయాంశమైంది. అయితే ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అని కొట్టిపారేశారాయన.

‘‘తెలియని విషయాలు, కొత్త సమాచారాలను తెలుసుకునేందుకు సోషల్‌ మీడియాని ఒక సాధనమని నమ్మి షేర్‌ చేస్తుంటా. అయినా నేను చెప్పని కొన్ని వ్యాఖ్యలను నిజంగా చెప్పినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారు’’ అని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని