Supreme Court: గద్వాల ఎమ్మెల్యేకు ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

Updated : 11 Sep 2023 14:16 IST

దిల్లీ: భారాసకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం, ప్రతివాదులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని డీకే అరుణ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బ్యాంకు ఖాతాలు వెల్లడించకపోవడం తప్పేనని కృష్ణమోహన్ రెడ్డి న్యాయవాది అంగీకరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

చిట్టి గుండెను కాపాడుకుందాం.. నిమ్స్‌లో 24 నుంచి ఉచిత శస్త్రచికిత్సలు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి భారాస (తెరాస) అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ (ప్రస్తుతం భాజపాలో ఉన్నారు) పోటీ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డికి 1,00,057, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన ఎన్నికను రద్దు చేసి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని