Telangana News: లక్షల సంఖ్యలో ఎలా తొలగిస్తారు? తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్‌ కార్డులు రద్దు చేయడంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తెలంగాణలో 19 లక్షలకుపైగా రేషన్‌ కార్డులను రద్దు చేయడంపై సుప్రీం...

Published : 27 Apr 2022 18:26 IST

దిల్లీ: తెలంగాణలో భారీ సంఖ్యలో రేషన్‌ కార్డులు రద్దు చేయడంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో రేషన్‌ కార్డుల రద్దుపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. తెలంగాణలో 19 లక్షలకుపైగా రేషన్‌ కార్డులను రద్దు చేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో సరైన పరిశీలన చేయకుండా లక్షల సంఖ్యలో రేషన్‌ కార్డులు ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 2016 మార్గదర్శకాలతో క్షేత్రస్థాయిలో మళ్లీ పరిశీలన జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో లక్షల రేషన్‌ కార్డుల రద్దుకు ఎలాంటి ప్రమాణాలు పాటించారో పేర్కొంటూ అఫిడవిట్‌ సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను ధర్మాసనం మూడు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని