Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు.
బెంగళూరు: నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వర్గాలు తాజాగా ఆయన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. తారకరత్నకు ప్రత్యేక బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్, ఇతర స్పెషలిస్ట్‌లు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ట్రీట్‌మెంట్ కొనసాగిస్తున్నాం’’ అని ఆస్పత్రి వర్గాలు ప్రకటనలో తెలిపాయి.
ఏం జరిగిందంటే?
చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
రూ.60 కోసం పదేళ్లు పోరాటం
-
India News
Arvind Kejriwal: మోదీ విద్యార్హతపై అనుమానం పెరిగింది: కేజ్రీవాల్
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
India News
వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు
-
Politics News
Ganta Srinivasa Rao: ఉత్తరాంధ్ర ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదు: గంటా
-
India News
వింత ఘటన.. ఉల్లి కోసేందుకు వెళితే కళ్లలోంచి కీటకాల ధార