Kancheti Sai: తెదేపా నేత కంచేటి సాయికి ఏప్రిల్‌ 8వరకు రిమాండ్‌

తెలుగుదేశం పార్టీ నేత కంచేటి సాయికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి కోర్టు ఏప్రిల్‌ 8వరకు రిమాండ్‌ విధించింది.

Published : 26 Mar 2024 20:46 IST

సత్తెనపల్లి: తెలుగుదేశం పార్టీ నేత కంచేటి సాయికి పల్నాడు జిల్లా సత్తెనపల్లి కోర్టు ఏప్రిల్‌ 8వరకు రిమాండ్‌ విధించింది. మార్చి 15న పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో వైకాపా కార్యాలయం దహనం ఘటనకు సంబంధించి కంచేటి సాయిపై కేసు నమోదైంది. ఈనెల 24న బ్యాంకాక్‌ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వెళ్లగా అక్కడి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని రాష్ట్ర పోలీసులకు అప్పగించారు.  మంగళవారం సత్తెనపల్లి తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అంతకు ముందు సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌లో.. ఎన్డీయే కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, ఇతర నాయకులు సాయిని పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని