SomiReddy: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దీక్ష భగ్నం

తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 

Updated : 19 Dec 2023 10:27 IST

నెల్లూరు: తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వితీస్తున్నారని సోమిరెడ్డి పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో మూడు రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆయన దీక్ష చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసి ఆయనను ఇంటి వద్ద దించి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని