Hyderabad News: సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు రూ.2,679 కోట్లు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు గచ్చిబౌలి టిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Updated : 21 Apr 2022 18:03 IST

హైదరాబాద్‌: భాగ్యనగరం నలుమూలల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్‌లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్‌లో రూ.2,679 కోట్లతో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టేందుకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఎల్బీనగర్‌లో నిర్మించనున్న ఆస్పత్రికి రూ.900 కోట్లు, సనత్ నగర్‌ ఆస్పత్రికి రూ. 882 కోట్లు, అల్వాల్ ఆస్పత్రికి రూ. 897 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)  ఆస్పత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎల్బీనగర్, అల్వాల్, సనత్ నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆస్పత్రుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని ఆర్ అండ్‌ బీ శాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని