Cricket: బిహార్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సెలూన్‌ నిర్వాహకుడు

బిహార్‌లోని మధుబనీ జిల్లాలో సెలూన్‌ నిర్వాహకుడు అశోక్‌ కుమార్‌ ఠాకుర్‌కు ‘డ్రీమ్‌-11’ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి అతడి వశమైంది. నానూర్‌ చౌక్‌ ప్రాంతంలో అశోక్‌ కుమార్‌కు ఓ సెలూన్‌ ఉంది.

Updated : 29 Sep 2021 07:14 IST

 డ్రీమ్‌-11 యాప్‌ ద్వారా వరించిన అదృష్టం

పట్నా: బిహార్‌లోని మధుబనీ జిల్లాలో సెలూన్‌ నిర్వాహకుడు అశోక్‌ కుమార్‌ ఠాకుర్‌కు ‘డ్రీమ్‌-11’ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. రూ.కోటి అతడి వశమైంది. నానూర్‌ చౌక్‌ ప్రాంతంలో అశోక్‌ కుమార్‌కు ఓ సెలూన్‌ ఉంది. ఆ దుకాణమే అతడికి జీవనాధారం. క్రికెట్‌పై ఆసక్తితో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ‘డ్రీమ్‌-11’లో అశోక్‌ తరచూ బెట్టింగ్‌ పెట్టేవాడు. ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌పైనా బెట్టింగ్‌ పెట్టాడు. అనూహ్యంగా రూ.కోటి దక్కించుకున్నాడు. ఆ సంగతి తెలియగానే అశోక్‌ ఆనందానికి అవధులు లేవు. గతంలో ఎన్నోసార్లు బెట్టింగ్‌ పెట్టానని, ఎప్పుడూ గెలవలేదని ఈ సందర్భంగా అతను చెప్పాడు. రూ.కోటి వచ్చినా.. తన వృత్తిని మాత్రం వదులుకోనని స్పష్టం చేశాడు. బెట్టింగ్‌ ద్వారా వచ్చిన రూ.కోటితో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని తెలిపాడు. రెండు, మూడు రోజుల్లో నగదు అశోక్‌ బ్యాంకు ఖాతాలో జమయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని