ఆ కేసులో నా ప్రమేయం లేదు.. ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించండి: సీఎం జగన్‌

అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్‌ నుంచి తనను తొలగించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు..

Published : 24 Aug 2021 21:58 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్‌ నుంచి తనను తొలగించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో తన ప్రమేయం లేదని.. పేరు తొలగించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికీ డిశ్చార్జ్ పిటిషన్లు వేయని నిందితులకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. మరో వైపు ఓబుళాపురం గనుల కేసులో అభియోగాల నమోదుపై తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వాదనలు నేటితో ముగిశాయి. సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ వాదనల వినిపించేందుకు విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని