Bullet Bandi Song: బుల్లెట్‌ బండి పాట.. ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డాన్స్‌

బుల్లెట్‌ బండి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగుతోంది. ఏ వేడుకలోనైనా ఈ పాట ఉండాల్సిందే.

Updated : 16 Sep 2021 12:47 IST

తిరుపతి: బుల్లెట్‌ బండి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట మార్మోగుతోంది. ఏ వేడుకలోనైనా ఈ పాట ఉండాల్సిందే. చిన్నా, పెద్దా అందరూ చిందులేయాల్సిందే. హుషారెత్తించే ఈ పాటకు తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సతీమణీ డాన్స్‌ వేశారు. మంత్రి నారాయణస్వామి 42వ వివాహ వార్సికోత్సవాన్ని తిరుపతిలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సతీమణి బుల్లెట్‌ బండి పాటకు సరదాగా నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని