CM Kcr: తెలంగాణలో అన్ని మతాల వారికి రక్షణ ఉంటుంది: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో  క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వేడుకకు

Updated : 22 Dec 2021 15:38 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో  క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ .. క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని మతాల వారికి రక్షణ ఉంటుందని  స్పష్టం చేశారు. ఎవరైనా మతపరమైన దాడులకు పాల్పడితే సహించేది లేదని,  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

‘‘మతం ఉన్మాద స్థాయికి చేరితే ప్రమాదం. ఎదుటి వారిని ప్రేమించడమే అత్యుత్తమ మతం. మహానుభావుల త్యాగాలే మనల్ని  ఈస్థాయికి తీసుకొచ్చాయి. ఇతర మతస్థులపై దాడి చేయడం గొప్ప విషయం కాదు. బోనాలు, క్రిస్మస్‌, రంజాన్‌ జరపాలని ఎవరూ నన్ను కోరలేదు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ముందుకు సాగాలి. ప్రపంచంలో విభిన్నమైన, అందమైన దేశం భారత్‌. భారత్‌లో అన్ని మతాల పండుగలు ఘనంగా జరుగుతాయి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని