TS News: ఈ ఏడాది సైబరాబాద్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎన్నో తెలుసా?

నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32,818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated : 26 Nov 2021 16:37 IST

హైదరాబాద్‌: నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 32,818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల వివరాలను సైబరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిలో 25,614 మంది ద్విచక్ర వాహనదారులు.. 1,055 ఆటో, 5,947 కార్లు, 202 భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీళ్లపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కమిషనరేట్‌ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 210 ప్రమాదాలు చోటుచేసుకోగా.. 232 మంది మృతిచెందారు.

సైబరాబాద్‌ పరిధిలో మొత్తం రోడ్డు ప్రమాదాల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగినవి 30.07శాతంగా ఉన్నాయి. మృతుల సంఖ్య 31.08 శాతం. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో 35ఏళ్ల లోపు యువకులే ఎక్కువగా పట్టుబడుతున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు